ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిరి శ్రీకాంత్, జలందర్‌రెడ్డి, సంఘ బాధ్యులు లచ్చారెడ్డి, దేవన్న, భీంరావు, అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు.


