కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిలో సోమవారం రెండో షిప్ట్‌లో మిస్‌ఫైర్ జరిగి నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... గనిలోని నార్త్ డిస్ట్రిక్ 22 లెవల్ 18 ఎక్స్ డీప్‌లో విధులు నిర్వహిస్తుండగా మ్యాన్‌హోల్ చేసే క్రమంలో డిటోనేటర్ పేలి సపోర్ట్‌మెన్‌్ కార్మికులు క్రాంతికుమార్, పుప్పాల శ్రీనివాస్, కోల్ కట్టర్ కార్మికులు రమేశ్, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా మందమర్రి డిస్పెన్సరీకి అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో అమర్చిన డిటోనేటర్ 1 పేలకుండా ఉండటంతో కార్మికులు దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో పేలినట్లు తెలిసింది.
చికిత్స పొందుతున్న క్రాంతికుమార్
చికిత్స పొందుతున్న రమేశ్


