ఆదిలాబాద్‌టౌన్: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. గడిచిన వారంలో 10 సైబర్ ఫిర్యాదులు అందాయ ని పేర్కొన్నారు. బేల పరిధిలో బాధితుడికి టెలి గ్రా మ్ ద్వారా పెట్టుబడి పేరుతో పరిచయం చేసుకొని రూ.9850 ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. గుడిహత్నూర్‌లో ఆ న్‌లైన్ షాపింగ్ పేరిట ఇన్‌స్ట్రాగామ్‌లో వస్తువులు పంపుతామని నమ్మించి రూ.5,195 మోసం చే సినట్లు చెప్పారు. ఆదిలాబాద్ టూటౌన్ ప రిధిలో రమ్మిబ్లస్ట్ ఆన్‌లైన్‌గేమ్ ఆడుతూ బాధితుడు రూ.లక్ష వరకు డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిపారు. టూటౌన్ పరిధిలో క్రెడిట్‌కార్డుయాప్ వివరాలు, ఓటీ పీ నమోదుతో రూ.29,933 బాధితుడు పో గొట్టుకున్నట్లు పేర్కొన్నారు. తాంసి పరిధి లో బాధితుడు ఓఎల్‌ఎక్స్‌లో మొబైల్‌ఫోన్ ప్రకటన చూసి రూ.85 వేలు చెల్లించి మోసపోయిన ట్లు తెలిపారు. ఇచ్చోడలో డీలర్‌షిప్ పేరుతో రూ. 35వేలు, ఆదిలాబాద్‌రూరల్ స్టేషన్‌పరిధిలో నకిలీ లోన్‌యాప్ పేరుతో వేధింపులు, ఉ ట్నూర్‌లో పెట్టుబడి పేరిట రూ.24,500 బాధితులు మోసపోయినట్లు తెలిపారు.ఎవరైనా సైబర్ మోసా నికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.


