ముగిసిన ‘సర్‌’ ప్రత్యేక శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘సర్‌’ ప్రత్యేక శిబిరాలు

Sep 7 2026 2:44 AM | Updated on Sep 7 2026 2:44 AM

● పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

కై లాస్‌నగర్‌: సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్ల సౌకర్యార్థం శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబి రాలు ముగిశాయి. జిల్లాలోని 600 పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉండి ఓటర్ల ము సాయిదా జాబితాలను ప్రదర్శించారు. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన దరఖాస్తులతో పాటు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించారు. ఆదిలా బాద్‌లోని డైట్‌ కళాశాల, మావలలోని ఉన్నత పాఠశాల పో లింగ్‌ కేంద్రాల్లో సవరణ ప్రక్రియను కలెక్టర్‌ రాజర్షి షా ఆదివారం పరిశీలించారు. ఓటర్లు అందించిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. యాప్‌ లో నమోదుపై ఆరా తీశారు. సర్‌ ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ ఎస్‌. రాజేశ్వర్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement