ఆదిలాబాద్‌టౌన్: ఆదివాసీల భూహక్కుల పరి రక్షణ కోసం ఉన్న 1/70 చట్టాన్ని కాపాడేందు కు తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాల్లో పోరా టాలు చేస్తామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఆదివాసీ హక్కుల సభలో పాల్గొ ని రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యలను ప్రస్తావించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్ట పరిరక్షణ, పేసా చట్టం అమలుపై ప్రభుత్వాల విధానాలు ఆదివాసీల హక్కులకు భంగం కలి గించేలా ఉన్నాయనివిమర్శించారు. ఆదివాసీల భూ ములు అన్యాక్రాంతం కాకుండా చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ యువతకు ఉ ద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంబంధించిన జీవో3ను పునరుద్ధరించాలన్నారు. ఈ సభ లో జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, కొట్నాక్ సక్కు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.


