● ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్‌ఎం మల్లేశయ్య
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్‌ఎం (ఆపరేష న్స్) మల్లేశయ్య సూచించారు. ఆదివారం మంచిర్యాల డిపో, బస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిపో సౌకర్యాలు, ప్రయాణికులకు అందుతున్న సేవలను ప రిశీలించి అధికారులకు పలు సూచనలు చేశా రు. ఛార్జీలు చెల్లించి ప్రయాణించే వారిని మ రింతగా ఆకర్షించి సంస్థకు రాబడి పెంపునకు దిశనిర్ధేశం చేశారు. ఆయన వెంట డిపో మేనేజర్ నరేష్‌కుమార్, అధికారులు ఉన్నారు.


