● కమీషన్ సంస్థగా మార్చారు
● టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్
శ్రీరాంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వపెద్దలు సింగరేణిని దోచుకుంటున్నారని మాజీమంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. నస్పూర్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సింగరేణి నిరసన సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణిని కమీషన్ సంస్థగా మార్చారని పేర్కొన్నారు. సంస్థ ఆర్థిక లావాదేవీపై లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. కంపెనీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 60 వేల కోట్లు చెల్లించకుండా దివాళా తీయించే కుట్ర చేస్తున్నారని అన్నారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆధారాలతో సహా వివరించారని తెలిపారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన సంఘాలు నేడు కార్మికులకు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. సింగరేణిలో ఎన్నికలెప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు మాట్లాడుతూ తమ హయాంలో కంపెనీ స్థలాల్లో ఉన్న ఇళ్లకు పట్టాలిపిస్తే నేడు 22(ఏ) నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్నారు. నస్పూర్‌లో 10 వేల ఇళ్లను ఇందులో చేర్చారని, ఇదంతా దండుకోవడానికే అన్నారు. దీనికి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ గెలిచిన సంఘాల కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు సంపత్, బ్రాంచి ఉపాధ్యక్షుడు రమేశ్, కేంద్ర కమిటీ నాయకులు లక్ష్మణ్, అన్వేశ్‌రెడ్డి, కుమారస్వామి, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బయ్య, పవన్‌కుమార్, కార్పొరేటర్ శ్రీనివాస్, నేతలు రవీందర్‌రెడ్డి, తిరుపతి, నీలం సదయ్య, హైమద్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో నియంతపాలన
మందమర్రిరూరల్: రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొ ప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలో ఆదివా రం నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గా ల ప్రజలకు న్యాయం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో అనేక హక్కులు కాలరా స్తోందన్నారు. మరో రెండేళ్ల తర్వాత కేసీఆర్ ప్ర భుత్వం వస్తుందన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ గెలుపునకు టీబీజీకేఎస్ భిక్ష అని అన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కార్మికులకు అనేక హక్కులు సాధించా మని తెలిపారు. ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘంగా విఫలమైందని, ఆ నాయకులను ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ గొడిసెల సంధ్యారాణి, టీబీజీకేఎస్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.