కాగజ్‌నగర్‌టౌన్: ఇటీవల శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిపిన ప్రత్యేక రైలు (07235/36)ను పండుగల సీజన్ వరకు కొనసాగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు కాకుండా 11.20 గంటలకు బయల్దేరితే సిర్పూర్ కాగజ్‌నగర్‌కు సాయంత్రం 4.10 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయల్దేరి రాత్రి 10.25 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈరైలు నుంచి ఆదరణ లభిస్తే క్రమబద్ధీకరించి అప్‌గ్రేడ్ చేసి కుమురంభీం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని ఉత్తర తెలంగాణ రైల్వేఫోరం సభ్యులు కోరుతున్నారు. ప్రస్తు తం కాజీపేట్ జంక్షన్‌లో 14 గంటల పాటు ఖాళీగా ఉన్న 17035/36 బల్లార్షా–కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు పొడగించాలని, బల్లార్షా నుంచి బయల్దేరే సమయం 5.20 గంటలకు మార్పు చేసి కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
చొరవ చూపాలి
ఈ రెండు రైళ్ల మంజూరు విషయంలో ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎంపీ నగేశ్ ప్రత్యేక చొరవ చూపాలి. కేంద్ర రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. ఎమ్మెల్యే హరీశ్‌బాబు గతంలో మాదిరిగా వీటిని పరిష్కరించాలి.
– ఫణిరాజ్, ఉత్తర తెలంగాణ
రైల్వే వినియోగదారుల ఫోరం ప్రతినిధి


