విద్యుత్‌ షాక్‌తో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

జన్నారం: విద్యుత్‌ షాక్‌తో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి చెందాడు. ఈ ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామానికి చెందిన మహ్మద్‌ వలియోద్దీన్‌ (45) ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం కాలనీలోని ఓ ఇంట్లో కరెంట్‌ మోటారుకు వైరు బిగిస్తున్నాడు. ఈక్రమంలో విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌ గురై ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు సీపీఆర్‌ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబీకులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించారు.

రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

గుడిహత్నూర్‌: మండలంలోని జాతీయ రహదారి 44పై మన్నూర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం..మన్నూర్‌ గ్రామానికి చెందిన కేంద్రే విజయ్‌ (23) శనివారం రాత్రి దాబాలో భోజనం చేసి బైక్‌పై తిరిగివస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement