భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్‌

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

నెన్నెల: కట్టుకున్న భార్యను హత్యచేసిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం బెల్లంపల్లిలో బెల్లంపల్లి రూరల్‌ సీఐ హనోక్‌ కేసు వివరాలు వెల్లడించారు. నెన్నెలలోని కాపువాడకు చెందిన తోట సబిత, తోట మల్లేశ్‌ భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 2న సబితను హత్య చేసి పరారయ్యాడు. గతంలో రెండుసార్లు హత్యకు యత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ఘటన అనంతరం దుస్తులు మార్చుకుని పరారైన మల్లేశ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం తాళ్లగురిజాల వై జంక్షన్‌ వద్ద అదుపులో తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. నెన్నెల ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

తల్లి కాటికి.. తండి జైలుకు..

తల్లి కాటికి.. తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు ఒంటరి వారయ్యారు. తాతయ్య, అమ్మమ్మ సంరక్షణ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పెద్ద మనుషులకే ఒకరు సాయం చేసే స్థితిలో ఉండగా ఈ పిల్లల భారం వారిపై పడింది. అమ్మప్రేమకు దూర మై నాన్న జైలు పాలు కావడంతో తమను ఎవరు చూసుకుంటారో తెలియని అయోమయంలో పిల్ల ల బాల్యం మిగిలిపోయింది. వారి చదువుపై తల్లికి ఎంతో శ్రద్ధ ఉండేదని అమ్మమ్మ, తాతయ్య తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లలను బాగా చదివించాలనేది ఆమె కోరిక నెరవేరకుండానే కన్నుమూసిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement