పట్టణ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

పట్టణ అభివృద్ధికి కృషి

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందుకోసం రూ.154 కోట్ల తో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామ ని, త్వరలోనే రూ.50 కోట్ల నిధులు విడుదల కానున్నాయని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు ట్రాక్టర్లను అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌తో కలిసి శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సి పాలిటీలో పారిశుధ్య నిర్వహణను మరింత మె రుగుపరిచేందుకు అవసరమైన వాహనాలను సమకూరుస్తున్నామని అన్నా రు. ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయించిన టీయూఎఫ్‌ఐడీసీ నిధుల్లో రూ.18 కోట్లు మంజూరయ్యాయ ని, వాటితో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మరోరూ.43 కోట్ల పనులు టెండర్‌ దశలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ క మిషనర్‌ ఏ.జగదీశ్వర్‌గౌడ్‌ , శానిటరీ ఇన్‌స్పెక్ట ర్‌ శంకర్‌, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్లు ఇజ్జ గిరి సంజయ్‌, వెనగంటి ప్రకాష్‌, కౌన్సిలర్లు బొడిగం శ్రీకాంత్‌, ఆత్రం వెంకటేష్‌, నాయకులు బండారి సతీష్‌, అన్నెల వసంత్‌, బొంపల హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement