ఆదిలాబాద్‌టౌన్: ఆదర్శ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మంది రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినో త్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. భార త మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం జిల్లాస్థాయిలో ఉత్తమపురస్కారాలకు ఎంపికై న ఉపాధ్యాయులను సన్మానించారు. జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన బో ధన అందించాలని సూచించారు. గతేడాది జిల్లాకు చెందిన 60మంది విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందారని ఈ ఏడాది ఆ సంఖ్య 100కు చేర్చేలా ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. గ్రా మాల్లో మద్యం దుకాణాలు లేకుండా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, ఇందుకు యంత్రాంగం సహకరిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. తన ఎదుగుదలలో గురువుల ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మా ట్లాడుతూ, విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా బోధన సాగాలన్నారు. వచ్చే ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులే ఎంపిక చేస్తారని డీఈవో మాధవి తెలిపారు. జాతీ య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంతోష్, ఉత్తమ పురస్కార గ్రహీత లావణ్య తమ బోధనా వి ధానంలో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ఇందులో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కలీం అహ్మద్, ఏఎంవో లక్ష్మణ్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


