విద్యారంగాన్ని విస్మరించి విజయోత్సవాలా? | - | Sakshi
Sakshi News home page

విద్యారంగాన్ని విస్మరించి విజయోత్సవాలా?

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

● సర్కారు తీరుపై బీఆర్‌ఎస్‌వీ మండిపాటు

కై లాస్‌నగర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఆరు గ్యారెంటీల అమలులోనూ విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ నాయకుడు శివకుమార్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. విద్యార్థులు, యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలతో పాటు వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు వాగ్మారె ప్రశాంత్‌, బట్టు సతీశ్‌, కరుణ, సాబీర్‌, హరీష్‌, శృతి, త్రిష, పల్లవి, రఘు, సాయి, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement