క్రీడాకారులు కోలిండియా స్థాయిలో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులు కోలిండియా స్థాయిలో రాణించాలి

Sep 5 2026 1:44 AM | Updated on Sep 5 2026 1:44 AM

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియా క్రీడాకారులు కో లిండియా స్థాయిలో రాణించాలని శ్రీరాంపూర్‌ జీఎం ఎం. శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ప్రగతి మైదానంలో ఏరియా స్థాయి డబ్ల్యూపీఎస్‌, జీఏ వా ర్షిక క్రీడలు మొదలయ్యాయి. మొదటిరోజు వాలీ బాల్‌ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏరియా క్రీ డాకారులు గత సంవత్సరం సాధించిన పతకాల కంటే రెట్టింపు పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈసారి క్రీడా సామగ్రి కొనుగోలు కోసం ఏరి యాకు రూ.4.5 లక్షలు మంజూరు చేశామన్నారు.

విన్నర్‌గా ఆర్కే5 గ్రూప్‌..

వాలీబాల్‌ పోటీల్లో విన్నర్‌గా ఆర్కే 5 గ్రూప్‌, రన్నర్‌గా ఆర్కే7 గ్రూపు నిలిచిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, ఏరియా ఎస్‌ఓటు జీఎం కృష్ణప్రసాద్‌, డీజీఎం(పర్సనల్‌) ఎస్‌.అనిల్‌కుమార్‌, క్రీడల గౌరవ కార్యదర్శి పాల్‌ సృజన్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ చాట్ల అశోక్‌, కోఆర్డినేటర్‌ తోట సురేశ్‌, కెప్టెన్లు చిన్నయ్య, ఎం.శ్రీనివాస్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement