ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించగా జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఇన్నోవెటివ్ బోధనలో జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లుండే రాము, కళాశాలను అభివృద్ధి చేసినందుకు గాను ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ సాయిప్రసాద్, ఉత్తమ బోధన, రీసెర్చ్‌లకు గాను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అగ్రికల్చర్ కళాశాల అగ్రోనమి ప్రొఫెసర్ మంజూలత అవార్డులు దక్కించుకున్నారు. ఈనెల 5న హైదరాబాద్‌లో వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.


