కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థికసంఘం నిధుల విడుదల కోసం పంచాయతీలవారీగా అభివృద్ధి ప్రణాళికలు కోరింది. ఆ దిశగా జిల్లాలోని 473 పంచాయతీలకు ఏడాదికాలంలో చేపట్టే పనుల ప్రతిపాదనలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేశాం. నిధుల మంజూరు, అభివృద్ధి పనుల వివరాలు నమోదు చేయాల్సి ఉండటంతో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్టే పడే అవకాశముంది. పంచాయతీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. తద్వారా పంచాయతీల అభివృద్ధికి తోడ్పడనుంది. జిల్లాకు రూ.40 కోట్లు విడుదలయ్యే అవకాశముంది.
– జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి


