కైలాస్‌నగర్: విద్యార్థులకు బోధనతో పాటు వా రిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు విభిన్న కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించేందు కోసమే ‘మై సెల్ఫ్’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమానికి సంబంధించి ఏ స్వైర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ ఏంఓయూ కుదుర్చుకొని, పోస్టర్ ఆవిష్కరించారు. వృత్తి నైపుణ్యాలు తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. బాల వికాస్ ఫౌండేషన్, కీ–స్టోన్ సంస్థల సహకారంతో పాఠశాలలకు అవసరమైన వసతులు, ఫర్నిచర్ వంటి సౌ కర్యాలు కల్పిస్తున్నామని వెల్ల డించారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, స్వచ్ఛంద సంస్థ ప్రతి నిధులు శ్రీలక్ష్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


