ఆదిలాబాద్‌టౌన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జడ్జి హుస్సేన్‌ను లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా సేవలు అందిస్తున్న ఈయన పదోన్నతిపై న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా నియామకం అయ్యారు. జడ్జిని కలిసిన వారిలో చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, చంద్రకాంత్, ఉమేష్‌రావు డోలే, రూపేష్, తిలోత్తమ ఉన్నారు.


