నేరడిగొండ: భూభారతిలో విధులు నిర్వహిస్తు న్న తమ సేవలు పునరుద్ధరించాలని ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ కోరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి రెవె న్యూ శాఖకు నిరంతరాయంగా సాంకేతిక సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


