ఆదిలాబాద్: బీజేపీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆది లాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ కోరారు. పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంపై సుమారు 50మంది దాడికి పాల్పడినట్లు తెలి పారు. బాధితులకు సంఘీభావం తెలిపేందు కు వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనన్నారు.


