బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం

Sep 2 2026 2:40 AM | Updated on Sep 2 2026 2:40 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● అట్రాసిటీ కేసులపై ఎస్పీతో కలిసి సమీక్ష

కై లాస్‌నగర్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ రాజ ర్షిషా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అట్రాసిటీ జిల్లాస్థాయి మానిటరింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి జిల్లాలో నమోదైన కేసులు, పు రోగతి, నష్టపరిహారంపై పోలీస్‌స్టేషన్లు, మండలా ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు అరికట్టడం, వారి హక్కులు కాపాడేందుకు చట్టపరంగా తగిన రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. అత్యాచార కేసుల్లో బాధితులకు పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు పునరావాసంతోపాటు, వారిలోధైర్యం నింపేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ, చట్టపరంగా ఎలాంటి లోపాలు లే కుండా కట్టుదిట్టమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్‌.ఎస్‌.చిత్రు, ఎస్‌. రాజేశ్వర్‌, డిప్యూటీ కలెక్టర్‌ వంశీ కృష్ణ, ఎస్సీ సంక్షేమ అధికారి సునీతకుమారి, ఈడీ మనోహర్‌, ఇత రశాఖలఅధికారులు, కమిటీసభ్యులు పాల్గొన్నారు.

భాషా నైపుణ్యాల పెంపునకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పోటీలు

విద్యార్థుల్లో ఆంగ్లభాషా సంభాషణ నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆగస్టు నెలకు సంబంధించి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కార్యక్రమ అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు ఎంతో కీలకమన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement