సీపీఎస్‌ రద్దు చేయాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు చేయాలని ఆందోళన

Sep 2 2026 2:40 AM | Updated on Sep 2 2026 2:40 AM

కై లాస్‌నగర్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శా పంగా మారిన సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధా నం పునరుద్దరించాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టర్‌ కా ర్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలి పారు. జేఏసీ నాయకులు శివకుమార్‌, నవీన్‌కుమా ర్‌ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఊ సెత్తకపోవడం శోచనీయమన్నారు. ఇందులో జేఏసీ నాయకులు కిష్టన్న, అశోక్‌, శ్రీనివాస్‌, రవికుమార్‌, శ్రీకాంత్‌ , నవీన్‌యాదవ్‌, చంద్రశేఖర్‌, విజయ్‌, నర్సింహులు, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

కోలిపూర ఉన్నత పాఠశాలలో

ఆదిలాబాద్‌టౌన్‌:పాత పెన్షన్‌ విధానం అమలు చే యాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రవీంద్ర డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆదిలాబాద్‌ పట్ట ణంలోని కోలిపూర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి సెప్టెంబర్‌ 1ని విద్రోహ దినంగా పాటించారు. ఇందులో పాఠశాల హెచ్‌ఎం మురళి, డి.శేఖర్‌, సంజీవ్‌ రావు, భీంరావు, రుబీన, పాండురంగ, మాధవి, పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ గెజిటెడ్‌ నం.1 పాఠశాలలో నిర్వహించిన ఇందులో హెచ్‌ఎం నీలాదేవి, సుకుమార్‌, యాదగిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement