ఆదిలాబాద్‌టౌన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని తనిషా గార్డెన్‌లో జిల్లాలోని గణపతి మండపా ల నిర్వాహకులు, కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వినాయక చవితి, నవరాత్రులు, నిమజ్జనం రోజు మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదన్నారు. ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వా లన్నారు. లక్కీడ్రాలు నిర్వహించవద్దని, బలవంతపు చందాలు వసూలు చేయవద్దని పేర్కొన్నారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్,సీఐలు సునిల్‌కుమార్, నాగరాజు, శ్రావణ్, రమేశ్, నరేశ్, ప్రసాద్, గురుస్వామి, వెంకటి, మురళీ, చంద్రశేఖర్, ఎస్సైలు, హిందు ఉత్సవ సమితి అధ్యక్షుడు హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.


