చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌, రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌, రిమాండ్‌

Sep 2 2026 2:40 AM | Updated on Sep 2 2026 2:40 AM

ములుగు: ములుగు జిల్లాలోని అబ్బాపూర్‌లో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్‌, నిర్మల్‌ జిల్లాకు చెందిన పండుగ రమేశ్‌, నిజామాబాద్‌ జిల్లా సారంగాపూర్‌కు చెందిన గుంజ గంగాధర్‌ కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 19న అబ్బాపూర్‌లో రెక్కీ నిర్వహించారు. రాత్రి వృద్ధురాలు మూత్రవిసర్జనకు బయటకు రావడంతో ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. అనంతరం గ్రామంలో పార్క్‌ చేసిన బైక్‌పై పరారయ్యారు. కొలనూరు రైల్వేస్టేషన్‌ వద్ద బైక్‌ పంక్చర్‌ కావడంతో అక్కడే వదిలి రైలులో మంచిర్యాల వెళ్లారు. ములుగు పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తుండగా మంగళవారం ఉదయం జీవింతరావుపల్లి వై జంక్షన్‌ వద్ద పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి 4.280 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు, రెక్కీకి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement