ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో 20 మంది బాలికలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీసీవో అరుణశ్రీ తెలిపారు. మొత్తం 60 మంది పోటీలో పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన 20 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న వారిలో అర్ధిక్ష, షర్మిత, సింధు, బిందు, హర్షిక, భూమిక, మీనాక్షి, మధుప్రియ, అక్షిత, అభీక్ష, కోమలి, వరలక్ష్మి, పల్లవి, నందిని, అశ్వథ, శ్రీవాణి, సుష్మిత, ప్రణవి ఉన్నారు. ఈ నెల 4 నుంచి 6 వరకు నిజామాబాద్ జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ రవి తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ రామ్మోహన్, వనిత, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.


