ఆదిలాబాద్‌టౌన్: ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితంపై బుధ, గురువారాల్లో ఢిల్లీలో నిర్వహించే జాతీ య సదస్సుకు గుడిహత్నూర్ మండలంలోని తో షం జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ హాజరు కానున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. సదస్సులో ఛత్రపతి శివాజీ జీవితం, నాయకత్వం, పరిపాలన దక్ష త, సైనిక వ్యూహాలు, ప్రజా సంక్షేమ దృక్పథం, వారసత్వంపై చర్చించనున్నారు. ఈయన తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతిలోని 11వ పాఠ్యాంశం మధ్యయుగ భారత చరిత్రలో భాగంగా మొగల్ చరిత్ర, శివాజీ చరిత్ర పరిపాలన అనే అంశాలను రచించారు.


