రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

రెబ్బెన: మెదక్‌ జిల్లా బీహెచ్‌ఈఎల్‌లో జరిగిన బాల్‌ బ్యాడ్మింటన్‌ అండర్‌–14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు కాంస్య పతకాన్ని సాధించినట్లు అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.తిరుపతి తెలిపారు. ఆదివారం జరిగిన సెమీఫైనల్‌ పోటీల్లో జిల్లా బాలికల జట్టు వరంగల్‌ జట్టుతో పోటీపడగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో స్వల్ప తేడా ఓడిపోయిందన్నారు. టోర్నమెంట్‌లో తృతీ యస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు నిజామాబాద్‌తో పోటీపడగా 35–25, 35–28 పాయింట్లతో విజయం సాధించి కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ అసోషియేషన్‌ వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.నారాయణరెడ్డి, అసోషియేషన్‌ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, కోశాధికారి భాస్కర్‌, సీనియర్‌ క్రీడాకారులు శంకర్‌, సంయుక్త కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అడ్వైజర్‌ శ్రీనివాస్‌రెడ్డిలు బాలికల జట్టును అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement