మరోసారి.. అదే తీరు | - | Sakshi
Sakshi News home page

మరోసారి.. అదే తీరు

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

పోడియం ఎదుట ‘కూటమి’ సభ్యుల ఆందోళన

కోఆప్షన్‌ ఎన్నిక సమావేశం వాయిదా వేసిన చైర్‌పర్సన్‌

హైకోర్టును ఆశ్రయిస్తామన్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు

మరోసారి అదే తీరు

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ కోఆప్షన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. నలు గురు సభ్యుల ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం 3గంటలకు కౌన్సిల్‌ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనాల్లో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి హాజరయ్యారు. సభ్యులను మిన హా ఇతరులేవరిని పోలీసులు లోనికి అనుమతించలేదు. కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తొలుత సభ్యుల సంతకాలు తీసుకున్నారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిపి 51 మంది ఉండగా ఎంఐఎం, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు గైర్హాజరయ్యారు.

పకడ్బందీ బందోబస్తు

ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యాలయానికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇతరులెవరినీ లోనికి అనుమతించలేదు. వన్‌టౌన్‌, టూ టౌన్‌ సీఐలతో పాటు పలువురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ జీవన్‌ రెడ్డి స్వయంగా కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మెజారిటీ ఉన్నా అడ్డుపడ్డారు..

సమావేశ నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని చైర్‌పర్సన్‌ హైకోర్టును ఆదేశించడంతో కోర్టు నాలుగు వారాల సమయమిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జరిగిన సమావేశంలో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరపాల్సి ఉంది. అయితే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు దాన్ని పాటించకుండా ఏదో అనవసరమైన అంశాన్ని తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టించారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. అయినప్పటికీ సీటుపై ఉంది మా చైర్‌పర్సనే అనే ఉద్దేశంతో ఆయా పార్టీల సభ్యులు ఆందో ళన చేసి ఎన్నికకు అడ్డుపడ్డారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఆ పార్టీల చెంపచెల్లుమనిపించేలా కోర్టు డైరెక్షన్‌ వస్తుందనే నమ్మకం ఉంది.

– గోడం నగేశ్‌, ఎంపీ

సభ్యుల డిమాండ్‌ మేరకే వాయిదా

ఎమ్మెల్యే భూకబ్జాలు, అక్రమాలపై విచారణ జరపాలని పలువురు సభ్యులు పట్టుబట్టారు. పట్టణంతో పాటు భోరజ్‌ మండలం హత్తి ఘాట్‌, గూడ, రాంపూర్‌ ఇండస్ట్రీయల్‌ కారి డార్‌కు సంబంధించి ఈడీ ఆధీనంలో ఉన్న భూములను బినామీల పేరిట అమ్మేసి అక్రమాలకు పాల్పడినట్లు సమావేశం దృష్టికి తెచ్చారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపించా కే ఎన్నిక నిర్వహించాలని సభ్యులు ఆందోళన కొనసాగించారు. ప్రజా సమస్యలపై చర్చించే సమావేశాలకు గైర్హాజరైన బీజేపీ సభ్యులు కోఆప్షన్‌పై ఎందుకంతా ఆసక్తి చూపుతున్నారని ప్రశ్నించారు. వారడిగింది సరైందే కనుక సమావేశాన్ని వాయిదా వేశాను. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.

– బండారి అనూష, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

హైకోర్టును ఆశ్రయిస్తాం..

బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కలిసి అడ్డుకోవాలనే కుట్ర తోనే ఈ ఎన్నికను వాయిదా వేశారు. లోపల జరిగి న సమావేశంనంతటిని వీడియోలో చిత్రీకరించాం. దాన్ని హైకోర్టుకు సమర్పిస్తాం. 27 మంది సభ్యులు నలుగురు బీజేపీ సభ్యులకు మద్దతునిస్తున్నామని చెప్పి కమిషనర్‌, చైర్‌పర్సన్‌కు రాత పూర్వకంగా అందజేశారు. స్పష్టమైన మెజార్టీ ఉన్నా బీజేపీకి అవకా శం ఇవ్వవద్దనే దురుద్దేశంతోనే ఎన్నికను అడ్డుకున్నా రు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. పట్టణ ప్రజ లు అంతా గమనిస్తున్నారు. తాను ఏదైనా తప్పుచేసి ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందు న విచారణ చేయించవచ్చు. 30సార్లు వాయిదా వేసినా బీజేపీ ఎదుగుదలను అడ్డుకోలేరు. మాకు స్పష్టమైన మెజార్టీ ఉంది. న్యాయపరంగా పోరాడుతాం.

– పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే

కూటమి సభ్యుల ఆందోళన

సమావేశం ప్రారంభంలోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌ పోడియం వద్దకువెళ్లి ఆందోళనకు దిగా రు. ఎమ్మెల్యే శంకర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్ర దర్శిస్తూ నిరసన చేపట్టారు. పట్టణంలో జరిగిన ఎమ్మెల్యే భూకబ్జాలపై విచారణ జరపాలని, విచా రణ పూర్తయ్యాకే కోఆప్షన్‌ ఎన్నిక నిర్వహించాలంటూ పట్టుబట్టారు. మరోవైపు ఎన్నిక నిర్వహించా ల్సిందేనని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఇరువర్గాల నినాదాలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా చైర్‌పర్సన్‌ ప్రకటించా రు. కూటమి సభ్యులతో కలిసి బయటకు వచ్చా రు. సభ్యులు మరోసారి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మరోవైపు బీజేపీ సభ్యులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే బయటకు వచ్చారు. వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement