‘చేయూత’కు దరఖాస్తుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’కు దరఖాస్తుల వెల్లువ

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

● జిల్లాలో 12,940 మంది అప్లై ● ఉట్నూర్‌ మండలంలో అత్యధికం ● ఈనెల 15 వరకు గడువు పెంపు

కైలాస్‌నగర్‌: చేయూత పథకం కింద అందించే సామాజిక పింఛన్‌ కోసం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారిలో హర్షం వ్యక్తమైంది. గత నెల 8 నుంచి స్వీకరణ ప్రక్రియ ప్రారంభించగా 31వరకు జిల్లావ్యాప్తంగా 12,940 మంది వివిధ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రభుత్వం ప్రకటించిన దరఖాస్తు గడువు సోమవారంతో ముగియగా తాజాగా మరో 15 రోజులు పొడిగించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

జిల్లాలో ఇలా..

దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్‌, బోధకాల వ్యా ధిగ్రస్తులకు కొత్తగా పింఛన్లు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం దాదాపు ఆరేళ్ల తర్వాత దరఖా స్తుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 8నుంచి ప్రక్రి య ప్రారంభించింది. పట్టణ పరిధిలో మున్సిపాలి టీలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీ కరించారు. ఈవివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లా వ్యా ప్తంగా 20 గ్రామీణ మండలాల పరిధిలో అత్యధికంగా ఉట్నూర్‌లో 1092మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా మావల మండలంలో 125 మంది దరఖాస్తులు అందజేశారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరి ధిలో 2,528 దరఖాస్తులు అందాయి. ఇందులో వి తంతువులు 421 మంది, ఒంటరి మహిళలు 61, దివ్యాంగులు 149, గీతకార్మికులు ముగ్గురున్నారు.

మరో 15 రోజుల గడువు పెంపు

ప్రభుత్వం తొలుత ప్రకటించిన దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. అర్హులై ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని వారి కోసం తాజాగా మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఈమేరకు జిల్లా అధి కారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంకా ఎవరైనా అర్హులుంటే సెప్టెంబర్‌ 15వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పింఛన్‌ విభాగం డీపీఎం జాదవ్‌ శేష్‌రావు తెలిపారు.

కేటగిరీల వారీగా అందిన

దరఖాస్తుల వివరాలు

వితంతువులు 8,694

ఒంటరి మహిళలు 1,241

దివ్యాంగులు 2,967

చేనేత కార్మికులు 3

గీత కార్మికులు 35

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement