ఉద్యోగ విరమణ సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ విరమణ సన్మానం

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

ఆదిలాబాద్‌టౌన్‌: విధి నిర్వహణలో ఎస్సై ఎండీ యూనుస్‌, కానిస్టేబుల్‌ పి.గంగారాం అందించిన సేవలు అభినందనీయమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరిని జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్‌శాఖలో అంకితభావంతో పనిచేసిన ఇద్దరి సేవలు స్ఫూర్తిదాయకమ ని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు కార్యాలయ ఏవో శివకుమార్‌, సీసీ కొండరాజు, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఆశన్న, సీఐ నైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ట్రెజరీ అధికారికి..

కై లాస్‌నగర్‌: ఉద్యోగ విరమణ పొందిన జిల్లా ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రామచంద్రరాజును టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్‌ కుమార్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శివ కుమార్‌, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి, ఏటీవోలు రమణాచారి, హారిక, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement