గ్రామానికి చెందిన దాగాం సావిత్రి బాయి, గంగాధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహం జరిపించారు. కొడుకు తులసీరామ్‌కు భైంసాకు చెందిన యువతితో గత వేసవిలో వివాహం చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే తులసీరామ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో సాసర్ కుండ్‌కు వెళ్లాడు. భార్యతో కలిసి అక్కడ దిగిన ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ ఆనంద దృశ్యాలు చెరిగిపోకముందే విధి వెక్కిరించింది. సోమవారం గ్రామస్తులను జీపులో యాత్రకు తీసుకెళ్లిన తులసీరామ్ తిరుగు ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్టేటస్ పెట్టి 24 గంటలు కూడా గడవకముందే అతను లేడన్న విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భైంసా ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.


