ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, సత్వర ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రారంభించనున్న మండల ప్రజావాణిని ప్రజలు సద్వినియో గం చేసుకోవాలి. ఎంపీడీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చాం. మండలస్థాయి అధికారులంతా విధిగా హాజరుకా వాలి. దరఖాస్తుదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. వారు పరిష్కరించలేని సమస్యలను డివిజన్, జిల్లాస్థాయికి పంపించాలి. బాఽధితులను పదేపదే తిప్పకుండా స త్వర న్యాయం చేకూర్చేలా వ్యవహరించాలి.
– ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్


