● మండల ప్రజావాణికి నేడు శ్రీకారం ● సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం ● దరఖాస్తుదారులకు తప్పనున్న తిప్పలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

● మండల ప్రజావాణికి నేడు శ్రీకారం ● సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం ● దరఖాస్తుదారులకు తప్పనున్న తిప్పలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● మండల ప్రజావాణికి నేడు శ్రీకారం ● సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం ● దరఖాస్తుదారులకు తప్పనున్న తిప్పలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

కై లాస్‌నగర్‌: ప్రజా సమస్యలను మండలస్థాయిలో నే పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మండల ప్రజావాణికి శ్రీ కారం చుట్టింది. సోమవారం నుంచి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ని ర్వహణపై ఎంపీడీవోలు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దరఖాస్తుదారులు అందించే ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే లా ఆపరేటర్లకు ప్రత్యేక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ల ను క్రియేట్‌ చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంటవరకు మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించనున్న గ్రీవెన్స్‌కు ఎంపీడీవో నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

నిర్వహణ ఇలా...

కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి తరహాలోనే ఇది కొనసాగనుంది. కార్యక్రమానికి ఎంపీడీవో, తహసీల్దార్తో పాటు ఎంపీవో, ఎంఏవో, ఉద్యానవన , పశుసంవర్ధక , మత్స్యశాఖ అధికారులు, ఎంఈవో, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌, సీడీపీవో, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, హౌసింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ ఏఈలు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ట్రాన్స్‌కో ఏఈ, డిప్యూటీ తహసీల్దార్‌ వంటి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఏఎస్‌డబ్ల్యూవో, ఏటీడీవో, బీసీ, మైనార్టీ సంక్షేమాధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ హాజరుకావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వీరంతా ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా యూ ఆకారంలో కూర్చోవాలి. ఒకవేళ అక్కడ స్థలం లేక ఇరుకుగా ఉంటే రైతు వేదికలు, ఇతర సౌకర్యవంతమైన భవనాల్లో నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దరఖాస్తుల స్వీకరణ ఇలా..

సమస్యలతో వచ్చే బాధితుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసేందు కోసం ఒక్కో మండలానికి ముగ్గురు ఆపరేటర్లను అందుబాటులో ఉంచనున్నారు. వారికి ప్రత్యేక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయించారు. ప్రజావాణి పోర్టల్‌లో దరఖాస్తులు, వాటితో అందించే డాక్యుమెంట్స్‌ను ఏ విధంగా నమోదు చేయాలి, స్కాన్‌ చేసి ఎలా అప్‌లోడ్‌ చేయాలి, దరఖాస్తుదారులకు రశీదు ఏ విధంగా ఇవ్వాలనే దానిపై ప్రత్యేక శిక్షణ అందించారు. దరఖాస్తుదారు ఆపరేటర్‌ను సంప్రదించి తమ సమస్యను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఆ సమస్య ఏ శాఖకు సంబంధించిందో నమోదు చేసి రశీదు అందజేస్తారు. దానికి ప్రత్యేక ఐడీ కేటాయించి ఆన్‌లైన్‌లో సంబంధిత శాఖకు పంపిస్తారు. అనంతరం అధికారులను కలిసి దరఖాస్తు అందజేస్తే వారు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు. కార్యక్రమ నిర్వహణపై ఎంపీడీవోలకు హైదరాబాద్‌లో ఈనెల 13న ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఎంపీడీవోలు 20 (15 మంది రెగ్యులర్‌, ఐదుగురు ఇన్‌చార్జి )

జిల్లాలో

మండల పరిషత్‌లు 20

కేటాయించిన ఆపరేటర్లు 60 మంది

భరోసా కల్పిస్తారా ..

మండల ప్రజావాణి ద్వారా దరఖాస్తుదారులు జిల్లా కేంద్రానికి వచ్చే వ్యయ, ప్రయాసాలు తొలగిపోనున్నాయి. స్థానికంగా అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండటంతో తమ సమస్యలను చెప్పుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే వాటి పరిష్కారంపైనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే దరఖాస్తుదారులు ఇప్పటి వరకు మండలస్థాయి అధికారులను కలిసి పలుమార్లు విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధికారుల నుంచి స్పందన కరువవడంతోనే జిల్లా స్థాయి వరకు వస్తున్నారు. తిరిగి మండలస్థాయి అధికారులకే విన్నవించడం ద్వారా ఏ మేరకు పరిష్కారమవుతాయనే దానిపై సర్వత్రా చర్చ సాగుతుంది.

మండల ప్రజావాణి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement