కరెంటు.. కాటేస్తోంది! | - | Sakshi
Sakshi News home page

కరెంటు.. కాటేస్తోంది!

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● వేలాడుతున్న విద్యుత్‌ తీగలు ● పడిపోయేందుకు సిద్ధంగా స్తంభాలు ● ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు

ఇచ్చోడ: జిల్లాలో చాలాచోట్ల విద్యుత్‌ తీగలు చేతి కందే ఎత్తులోనే దర్శనమిస్తున్నాయి. స్తంభాలు ఎప్పుడు కింద పడతాయో అన్న చందంగా మారా యి. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కరువై ప్రమాదాలకు కేరాఫ్‌గా మారాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో విద్యుదాఘాతంతో పలువురి మృతి చెందగా.. వందలాది మూగజీవాలు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికారులు మాత్రం ఫిర్యాదులు అందితే స్పందిస్తామని పే ర్కొంటుండడం గమనార్హం.

పెండింగ్‌లో 21 ఫిర్యాదులేనట!

జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ సమస్యల పరిష్కారం కో సం అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని మరో 21 మాత్రమే పెండింగ్‌లో ఉ న్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక్కో మండలంలోనే పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలాగ్రామాల్లో తక్కువ ఎత్తులో వేలా డుతున్న విద్యుత్‌ తీగలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకా లం కావడంతో ఈదురుగాలుల కారణంగా అవి తెగిపడుతున్నాయి. గమనించని మనుషులు, మూ గజీవాలు వాటికి తగిలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మనుషులు, నాలుగు మూగజీవాలకు సంబంధించి బాధితులకు పరిహారం అందజేసినట్లుగా అధికారులు పేర్కొనడం గమనార్హం.

ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం..

విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఇంకా 21 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వర్షాకాలం కావడంతో చేలలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో కొంత ఆలస్యమవుతుంది.

– జాదవ్‌ సుభాష్‌, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement