జిల్లాలో 1,461 పాఠశాలలు, కళాశాలల్లో ప్రశస్త్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల వైకల్యం నిర్ధారణ కోసం చర్యలు చేపడుతున్నాం. మూడు విడతల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 1 నుంచి 31 వరకు ఉపాధ్యాయులు వీడియోలు చూసి విద్యార్థుల లోపాలను గుర్తించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు స్క్రీనింగ్ చేసిన తర్వాత ప్రత్యేక విద్య, ఐఆర్‌పీలు ఆ విద్యార్థులను పరిశీలించి వైకల్యాన్ని నిర్ధారిస్తారు. అవసరమైన విద్యార్థులకు వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుంది.
– ఉష్కం తిరుపతి, సెక్టోరియల్ అధికారి


