తాగునీటికి కొత్త పైపులైన్‌ | - | Sakshi
Sakshi News home page

తాగునీటికి కొత్త పైపులైన్‌

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

రూ.10.85 కోట్లతో బల్దియా ప్రతిపాదనలు

నిధుల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

టెండర్ల నిర్వహణకు అధికారుల కసరత్తు

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు నే పథ్యంలో లాండసాంగ్వి పంప్‌హౌస్‌ నుంచి పట్ట ణానికి నీటిని సరఫరా చేసే పైపులైన్‌ ఇక కనుమరుగుకానుంది. ప్రత్యామ్నాయంగా మరొకటి ఏర్పా టు చేయాలని మున్సిపల్‌ అధికారులు భావించా రు. ఇందుకోసం రూ.10.85 కోట్ల అంచనాతో ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అత్యవసరం కావడంతో ఆమోదం తెలిపిన సర్కారు వెంటనే నిధులు సైతం మంజూరు చేసింది. ప్రజారోగ్యశాఖ అధికారులు టెండర్ల నిర్వహణ కు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

పాతపైపులైన్‌ కనుమరుగు

పట్టణ శివారులోని లాండసాంగ్వి పంప్‌హౌస్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వద్దనున్న రిజర్వాయర్‌లోకి 12ఎంఎల్‌డీ నీటిని తరలించేందు కోసం గతంలో 1.8 కిలోమీటర్ల దూరంతో కూడిన పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. పంప్‌హౌస్‌ నుంచి సీసీఐ క్రాస్‌ రోడ్‌, అనుకుంట రోడ్‌లోని క్రిస్టల్‌ గార్డెన్‌, ఖానాపూర్‌, అబ్దుల్లాచౌక్‌, వినాయక్‌చౌక్‌ల మీదుగా ఉన్న ఈ పైపులైన్‌ ద్వారా ప్రస్తుతం 7 ఎంఎల్‌డీ నీరు అందుతోంది. రిజర్వాయర్‌లోకి చేరిన నీటిని పలు కాలనీలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టు ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం క్రిస్టల్‌ గార్డెన్‌ నుంచి అబ్దుల్లాచౌక్‌ వరకు ఉన్న పైపులైన్‌ కనుమరుగుకానుంది. దీంతో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడింది.

కొత్త పైపులైన్‌ ఇలా..

పట్టణం నుంచి లాండసాంగ్వి మీదుగా నీరాలకు వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని పాత జాతీయ రహదారి మీదుగా కొత్త పైపులైన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీసీఐ క్రాస్‌ రోడ్‌ నుంచి తిర్పెల్లి శ్మశానవాటిక, అక్కడి నుంచి భుక్తాపూర్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు గల పాత జాతీయ రహదారి, నేతాజీచౌక్‌, వినాయక్‌చౌక్‌ల మీదుగా మున్సిపల్‌ కార్యాలయం వద్ద గల రిజర్వాయర్‌ వరకు 5.2 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. ఈ సారి 3.4 కిలోమీటర్ల మేర అదనంగా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇందుకు గాను రూ.10.85కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించారు. క్షేత్రస్థాయి పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. నిధులు సైతం మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆ 250 మీటర్ల స్థలమే ప్రధాన అడ్డంకి

కొత్త పైపులైన్‌కు భూ సేకరణ చేయాల్సిన అవసరమేర్పడలేదు. జాతీయ రహదారి మీదుగా దీన్ని ఏ ర్పాటు చేయనున్నారు. అయితే తిర్పెల్లి సమీపంలో రామాలయంవరకు గల 250మీటర్ల స్థలంలో కోర్టు కేసు కారణంగా పాత జాతీయ రహదారిని నిర్మించలేదు. పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అక్కడ పైపులైన్‌ ఏర్పాటు చేస్తే రహదారి నిర్మాణ పనులు చేపడితే మళ్లీ కొత్తగా పైపులైన్‌ చేపట్టాల్సి వస్తోంది. దీంతో నిధులు వృథా అయ్యే అవకాశముంది. దారికి ఇబ్బంది లేకుండా పక్క నుంచి పైపులైన్‌ వేయాలంటే రెండునుంచి మూడు ఇళ్లను తొలగించాల్సి రా వడం సమస్యాత్మకంగా మారుతుంది. అక్కడ కొంత భూమిసేకరించాల్సి వస్తోంది. దీనిపై స్పష్టత లేకపోవడంతో పనులకు అడ్డంకిగా మారే అవకాశముంది. దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై అధి కారులు ఆలోచిస్తున్నారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తూ ముందుకు సాగుతున్నారు.

టెండర్ల నిర్వహణకు కసరత్తు

ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో కనుమరుగయ్యే పైపులైన్‌తో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పైపులైన్‌కు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం కూడా ఆమోదించి నిధులు మంజూరు చేసింది. పనుల ఆమోదం కోసం ఈఎన్‌సీకి పంపించాం. రెండు, మూడు రోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటిస్తాం.మూడు నెలల్లోపు పనులు పూర్తయ్యేలా ముందుకు సాగుతున్నాం.

– పి.అరుణ్‌ కుమార్‌, మున్పిపల్‌ ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement