ఆదిలాబాద్‌టౌన్: కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో నేరస్తులకు శిక్షలు ప డేలా దర్యాప్తు, కోర్టు డ్యూటీ అధికారులు స మన్వయంతో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా కోర్టు డ్యూటీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కేసుల్లో సాక్ష్యాధారాలను పటిష్టంగా సమర్పిస్తూ, ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. అనంతరం కోర్టు విధుల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. ఇందులో డీసీఆర్‌బీ ఎస్సై ప్రవీణ్, కోర్టు లైజన్ అధికారులు గంగాసింగ్, పండరి, కోర్టు డ్యూటీ అధికారులు, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.
పిప్పర్‌వాడలో ‘పోలీసులు మీకోసం’
సాత్నాల: భోరజ్ మండలం పిప్పర్‌వాడలో శనివారం పోలీసులు మీకోసం కార్యక్రమం నిర్వహించారు.వాలీబాల్ పోటీలో విజేత జట్టుకు ఎస్పీ బహుమతి ప్రదానం చేశారు. పూసాయి గ్రామంలో ఏర్పాటు చేసిన 17 సీసీ కెమెరాలను ప్రారంభించారు. 15 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, ఎస్సైలు పవర్ గౌతం, పీర్ సింగ్, పిప్పర్‌వాడ సర్పంచ్ సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.


