ఆదిలాబాద్‌టౌన్: స్నేహం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. కష్టసుఖా ల్లో అండగా నిలిచే స్నేహితులే మన బలం. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌర వం, సహకారంతో కూడిన స్నేహం ఎప్పుడు బలోపేతంగా ఉంటుంది. నేను ఇంటర్మీడియెట్ ఉట్నూర్‌లో చదివేటప్పుడు 1988లో బొజ్జ వెంకట్‌రాజుతో స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మా స్నేహబంధం కొనసాగుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉన్నాం. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్


