ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులకు సంబంధించిన అపార్‌ను వందశాతం పూర్తి చేయాలని డీఈ వో డి.మాధవి అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో శనివారం సమావేశం నిర్వహించారు. యూడైస్, ఎన్‌రోల్‌మెంట్, డ్రాప్ బాక్స్, ఆధార్, అపార్ జనరేషన్, క్యాస్ట్ పెండింగ్ వర్క్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రాప్ బాక్స్‌లో ఉన్నవాటిని రెండు రోజుల్లో పూర్తి చే యాలని సూచించారు. ఈనెల 10లోగా ఫిజిక ల్ అటెండెన్స్, విద్యార్థుల యూడైస్ సంఖ్య ఒకేలా ఉండాలని ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ రఘురమణ, ఎంఈవో సోమయ్య, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్, స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ ఉస్మానొద్దీన్, సలీ మ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


