ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చాలని డీవైఎస్‌వో దయానంద్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన అథ్లెటిక్స్, జావెలిన్‌త్రో జిల్లాస్థా యి ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించా రు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి సారించాలని సూచించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ, ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీ డాకారులు ఈనెల 7, 8 తేదీల్లో హన్మకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతి నిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఇందులో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రెజరర్ వీజీ ఎస్ రాకేశ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రామేశ్వర్, పీడీ, పీఈటీల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాంతారావు, స్వామి పాల్గొన్నారు.


