ఉట్నూర్‌రూరల్: అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన ఉట్నూర్ మండలం నాగాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, డ్రైవర్ నర్సింలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నుంచి ఉట్నూరు మీదుగా అమరావతికి లారీలో కొబ్బరిబొండాలు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నాగాపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి లారీ అదుపుతప్పి బోల్తా పడినట్లు డ్రైవర్ తెలిపాడు. కొబ్బరిబోండాలను వేరే వాహనంలో తరలించినట్లు పేర్కొన్నాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, సమీపంలోనే ఉన్న వంతెన వద్ద పడితే పెనుప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు.


