ఖానాపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన గొండాల రంజిత్ కుమార్ ఆదివారం రాత్రి ఈ–స్కూటీపై ఖానాపూర్ నుంచి నిర్మల్ వెళ్తుండగా కుమురం భీంచౌరస్తా–ఇక్బాల్‌పూర్ మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో మొదట స్థానికంగా చికిత్స అందించి, మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీ చేయాలని, రూ.10 లక్షల వరకు ఖర్చుఅవుతుందని తెలిపారు. దాతలు మానవత్వంతో స్పందించి చేతనైనంత ఆర్థిక సాయం అందించి యువకుడి ప్రాణాలు కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దా తలు 9000524553 నంబర్‌కు ఫోన్‌పే ద్వారా ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లావాసికి గాయాలు
లక్ష్మణచాంద: అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువ ఇంజినీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాఽ దిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నర్సాపూ ర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీని వాస్‌రెడ్డి, విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానందరెడ్డి ఎంఎస్ చేసేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం లోని డెట్రాయిట్‌కు వెళ్లాడు. ఎంఎస్ పూర్తి కావడంతో అక్కడే ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మర్ రాగి తీగ చోరీ
తాండూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో అమర్చిన ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి కాపర్ వైర్, ఆయిల్ అపహరించారు. రైతులు పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ అమర్చి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
కుటుంబ కలహాలతో
భర్త ఆత్మహత్య
నస్పూర్: కుటుంబ కలహాల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘట న నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్ర శాంత్‌నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్‌నగర్‌కు చెందిన కుచాడి సతీష్(48) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో సూపర్‌వైజర్‌గా పని చేసేవాడు. భార్య విజయ, కూతు రు సంజనితో కలిసి అక్కడే ఉండేవాడు. సతీష్ తండ్రి శేఖర్ గత మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో సతీష్ కుటుంబం ఇంటివద్దకే వచ్చి తల్లి తులసితో కలిసి ఉంటున్నారు. సతీష్, విజయ మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు నెలలుగా గొడవలు జరగడంతో జీవితంపై విరక్తి చెందాడు. మంగళవారం వేకువజామున సతీష్ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


