ఇచ్చోడ: మండలంలోని దాబా బి సర్పంచ్ నర్వటే ఈశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ ఇటీవల కొంత మంది రైతులకు అనధికారంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయించాడు. ఈ ఘటనలో ఆదిలాబాద్ టాస్క్‌ఫోర్స్ టీం విచారణ జరిపి విక్రయించిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సర్పంచ్‌పై ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక అనుసరించి జిల్లా వ్యవసాయాధికారి సమర్పించిన నివేదిక అధారంగా ఈశ్వర్‌కు జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేస్తూ వివరణ కోరారు. సంజాయిషీ సంతృప్తికరంగా లేనందున అతడిని సర్పంచ్ పదవిలో కొనసాగకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.


