బాసర ఆలయంలో ఒడిబియ్యం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

బాసర ఆలయంలో ఒడిబియ్యం లెక్కింపు

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

బాసర : జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడి బియ్యం మంగళవారం లెక్కించారు. ఎండు కొబ్బరి కుడుకలు, బాదం, బరడి పోకలు, పసుపు కొమ్మలు, ఖర్జూరాల ద్వారా రూ.7,308, 50 కిలోల చొప్పున 97 సంచులు (48 క్వింటాళ్లు) ఒడి బియ్యం ద్వారా రూ.93,071 ఆదాయం సమకూరింది. మొత్తంగా ఆలయానికి రూ.1,00,379 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఈవో గంగా శ్రీనివాస్‌, ఆలయ పర్యవేక్షకులు సంజీవ్‌రావు, శివరాజ్‌, నానం సాయిలు, గోపాల్‌ సింగ్‌, ఆలయ సిబ్బంది, వాగ్దేవి లేబర్‌ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement