కుంటాలకు జలకళ
కురుస్తున్న వర్షాలతో కుంటాల జల పాతం మంగళవారం జలకళ సంతరించుకుంది. పర్యాటకుల తాకిడి మొదలైంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. – నేరడిగొండ
ఆదిలాబాద్‌టౌన్: సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. ప్రస్త్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. దగ్గు, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. రిమ్స్ ఓపీ పెరుగుతోంది. రెండు రోజులుగా 2400కు పైగా నమోదవుతుండడం గమనార్హం. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ అప్రమత్తమైంది. ర్యాపిడ్ ఫీవర్ సర్వేతో పాటు ఎపడమిక్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. స్టాప్ డయేరియా కార్యక్రమం చేపడుతుంది. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. పలువురు మృత్యువాత పడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వర్షాకాలం.. వ్యాధుల కాలం
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆయా గ్రామాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. గుంతలు, మురుగుకాలువలతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటుంది. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. జిల్లాలో వారం రోజులుగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. జిల్లాలోని సాత్నాల మండలం మాంగుర్లలో ఒకరికి, ఇంద్రవెల్లి మండలంలోని మెండపల్లిలో మరొకరికి డెంగీ పాజిటీవ్ నిర్ధారణ అయింది. ఈమేరకు అధికారులు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు.
వైద్యశాఖ ప్రత్యేక చర్యలు..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ముందస్తుగానే ప్రణాళిక తయారు చేసింది. చిన్నారులు డయేరియా బారిన పడకుండా స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. జూన్ 1 నుంచి మొదలైన ర్యాపిడ్ ఫీవర్ సర్వే సెప్టెంబర్ వరకు చేపట్టనుంది. ఇంటింటికి వెళ్లి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు జ్వరపీడితుల వివరాలు సేకరిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యగా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జ్వరం అదుపునకు అవసరమైన మందులు అందజేస్తున్నారు. పలుచోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గిరిజనులు నివసించే గ్రామాల్లో జన్‌మన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వాహనాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు.
కురిసింది :
246.5
స్థితి : 41శాతం
లోటు వర్షపాతం


