మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట

Jul 22 2026 11:23 AM | Updated on Jul 22 2026 11:23 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. స్థానిక పోలీసు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో షీటీం ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులను వేధించిన 180 మంది ఆకతా యిలు, వారి తల్లిదండ్రులకు మంగళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ, గడిచిన ఆరు నెలల్లో మహిళలు, చిన్నారులు, విద్యార్థులపై వేధింపులకు సంబంధించి జిల్లాలో 230 పెట్టీ కేసులు, 20కు పైగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. సోషల్‌ మీడియా, వా ట్సాప్‌, ఇన్‌స్ట్రాగాం ద్వారా అసభ్య సందేశాలు పంపడం, పాఠశాలలు, కళాశాలల వద్ద విద్యార్థినుల ను వేధించడం, వివాహిత మహిళలను బ్లాక్‌మెయి ల్‌ చేయడం, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఇబ్బందులకు గురి చేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరాలని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే నేరుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రె డ్డి, టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగరాజు, డబ్ల్యూపీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.ఫణిందర్‌, షీటీం సభ్యులు సుశీల, వాణిశ్రీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మట్కా రహిత జిల్లా లక్ష్యం

మట్కా రహిత జిల్లా లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మట్కా వంటి జూద కార్యకలాపాల నిర్మూలనే ల క్ష్యంగా సోమవారం ప్ర త్యేక డ్రైవ్‌ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 పోలీస్‌స్టేషన్ల పరిధి లో 20 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మొత్తం 54 మంది నిర్వాహకులు, ఆటగాళ్లను తనిఖీ చేసి 34 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతో జిల్లాను మట్కా రహితంగా తీర్చిదిద్దుతామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement