మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత

Jul 22 2026 11:23 AM | Updated on Jul 22 2026 11:23 AM

ఉట్నూర్‌రూరల్‌: ఆదివాసీ భాషలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఐటీడీఏ పీవో మంద మకరందు ఆకాంక్షించారు. మాతృభాషను పరిరక్షించడం ప్రతి ఒక్క రూ బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో కేబీ కాంప్లెక్స్‌ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా గోండి,కొలాం భాషల్లో మాతృభాష దినోత్సవ శు భాకాంక్షలు తెలిపారు. గిరిజన భాషలను సాంకేతికతతో అనుసంధానం చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో ఐఐటీ విద్యార్థుల సహకారంతో ఏఐ ఆధారిత భాషా వేదికను రూపొందిస్తున్నామని వివరించారు. ఈ సాంకేతిక వేదిక ద్వారా గోండి, కొలాం భాషలను నేర్చుకోవడం సులభమవడంతో పాటు ఇతర భాష ల వారికి కూడా అర్థం అవుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ, గోండి, కొలాం భాషల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం గోండి–కొలామి పొడుపు కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడీ ప్రేమకళ, ఏపీఓ (పీవీటీజీ)భాస్కర్‌, డిప్యూ టీ ఈఈ చందన్‌,ఈఈ తానాజీ, డీఎంజీసీ సందీప్‌ కుమార్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌వో మనోహర్‌, ఐటీడీఏ అధికారులు,ఆదివాసీ సార్‌మేడిలు, గ్రామపటేళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement