ఓటు హక్కు విలువైంది | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు విలువైంది

Jul 22 2026 11:23 AM | Updated on Jul 22 2026 11:23 AM

తలమడుగు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్‌ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరా వు అన్నారు. మండలంలోని ఖోడత్‌, ఉండం, సుంకిడి, లింగి, కుచులాపూర్‌, పల్సి కే, పల్సి బి, పల్సి తండా, ఉమ్రీ, బరంపూర్‌, దేవాపూర్‌ తదితర గ్రామాలలో సర్‌ ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. బీఎల్‌వోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర పూరితంగా మైనారిటీ క్రిస్టియన్‌, కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అర్హులైన ఓటర్లను జా బితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ప్రతాప్‌, నాయకులు వెంకన్న యాదవ్‌, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement