కై లాస్‌నగర్: ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు ప రిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీయూఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చవాన్, వలభోజు గోపీకృష్ణ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు చెల్లించడంతో పాటు జూలై నుంచి పీఆర్సీ ప్రకటించాలని డి మాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీ మ్ పునరుద్ధరించాలన్నారు. సంఘ బాధ్యులు కు మ్ర యాదవరావు, జిజాబాయి, సంగీత, కేశవ్, గంగాధర్, విలాస్, రాజ్‌కుమార్, పాల్గొన్నారు.


