ఆదివాసీ చట్టాల పరిరక్షణకు జోక్యం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ చట్టాల పరిరక్షణకు జోక్యం చేసుకోవాలి

Jul 15 2026 12:05 AM | Updated on Jul 15 2026 12:05 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదివాసీ చట్టాల రక్షణకు ఎస్టీ కమిషన్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు ఆశలక్రను మంగళవారం ఢిల్లీలో కలిశారు. సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లోని గిరిజనులకు చట్టపరమైన రక్షణ తగ్గుతుందన్నారు. గిరిజన భూములు, అటవీ ప్రాంతాలపై చట్టవిరుద్ధంగా ఆక్రమణలు చేసి అక్కడి నుంచి గిరిజన కుటుంబా లను తరలిస్తున్నారని తదితర విషయాలను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వినతి సమర్పించి న వారిలో రాజ్యసభ సభ్యులు శివదాసన్‌, ఏఐ ఏడబ్ల్యూ జాతీయ కార్యదర్శి బి.వెంకట్‌, ఏపీజీఎస్‌ కార్యదర్శి సురేంద్ర తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement